Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతోంది. ఊహించని ట్విస్టులు, కాంట్రవర్సీలు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ ఎపిసోడ్లో కింగ్ నాగార్జున తన హోస్టింగ్‌తో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు క్లాస్ కూడా ఇచ్చారు. నాగార్జున సరదాగా వేసిన ఛాలెంజ్‌తో తనూజ తన తొలి ప్రేమ రహస్యాన్ని బయట పెట్టింది. కాఫీ కోసం తన మొదటి క్రష్ గురించి చెప్పిన ఆమె కాస్త ఎమోషనల్ అయ్యింది. ఈ రివీల్‌తో బిగ్ బాస్ హౌస్‌లో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ వారం నామినేషన్లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా, తొలి రౌండ్లోనే భరణి, మాస్క్ మాన్ హరీష్ సేఫ్ అయ్యారు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో డిమాన్ పవన్ విజయం సాధించి మరోసారి కెప్టెన్‌గా నిలిచాడు. పోరాటంలో ఇమ్మాన్యుయేల్ ఫైటింగ్ స్పిరిట్‌ను నాగార్జున మెచ్చుకున్నారు.
సుమన్ శెట్టి, ప్రియా శెట్టి, ఫ్లోరా షైనీ, మర్యాద మనీష్ మధ్య ఎలిమినేషన్ సస్పెన్స్ పెరిగింది. చివరికి ఊహించని విధంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ కాగా, ఫ్లోరా హౌస్‌లో కొనసాగింది. ఈ నిర్ణయం తోటి కంటెస్టెంట్లను షాక్‌కు గురి చేసింది. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్‌పైకి వచ్చిన మనీష్, టాప్ & బాటమ్ కంటెస్టెంట్లపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. సంజనపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పగా, హరీష్ కోపం తగ్గించుకోవాలని సూచించాడు. చివరగా ప్రియా శెట్టిపై బిగ్ బాంబ్ వేసి టాయిలెట్ క్లీనింగ్ టాస్క్ అప్పగించాడు.
ఎలిమినేషన్ నుంచి బయటపడ్డా, మరో టాస్క్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఫ్లోరా షైనీని “మోస్ట్ బోరింగ్ పర్సన్”గా ఎంపిక చేయడంతో ఆమె బిగ్ బాస్ లాకప్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హౌస్‌లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తంగా వీకెండ్ ఎపిసోడ్లో ఒక ఎలిమినేషన్, ఒక లాకప్ శిక్షతో బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లకు మిక్స్డ్ ఎమోషన్స్ ఎదురయ్యాయి. నాగార్జున హోస్టింగ్, బిగ్ బాస్ ట్విస్టులు షోకు మరింత ఉత్కంఠను తెచ్చాయి. ఇక మూడో వారం బిగ్ బాస్ హౌజ్‌లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సి ఉంది.