హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్టు టీ టీడీ తెలిపింది. 9 రోజులపాటు జరిగే వేడుకలకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో వాహనంపై స్వామివారు విహరించనున్నారు. 27న గరుడసేవ నిర్వహించనున్నారు. ఊ రేగింపు సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. దీంతో టీటీడీ భక్తులకు కీలక ప్రకటన చేసింది. భక్తులు కానుకలు చెల్లించరాదని విజ్ఞప్తిచేసింది.
మహాలయ అమావాస్య సందర్భంగా తిరుమలలోని కపిలతీర్థంలో పితృతర్పణాల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులపై టీటీడీ స్పందించింది. కపిలతీర్థంలో పితృతర్పణాలకు సరైన ఏర్పాట్లు చేయలేదని వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నది. దుష్ప్రచారం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.