Gandhi Statue | కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారీ గాంధీ విగ్రహం పెట్టాలన్నరేవంత్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయడం లేదు. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు మాకు నిలువనీడ లేకుండా చేస్తున్నారని మూసీ బాధితులు కన్నీరు పెడుతుంటే.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఇల్లు కోల్పోతున్న, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసిన నిర్మాత ఎం.వీ రమణా రెడ్డి మాటలు మాత్రం ఇవేం పట్టనట్టుగా ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం నన్నడిగితే తప్పకుండా ఒక ఉన్నతమైనట్వంటి శిల్పాన్ని ప్రపంచం ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దే బాధ్యత నాది. తప్పకుండా నేనా పని చేస్తా.. కానీ ఇప్పటివరకు నన్ను ఎవరు స్పందించలేదు. రూ.5000 కోట్ల గాంధీ విగ్రహం కాంట్రాక్ట్ నాకు ఇస్తే చేస్తా. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకూ నన్ను ఇంకా ఎవరూ అడగలేదన్నాడు.
కాగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో, బ్యాంకులో లోన్లు తీసుకొని ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టుకుంటే.. అది కూల్చేస్తే మేమెలా బ్రతికేది..? మేము తీసుకున్న బ్యాంకు లోన్లు కూడా తీరిపోలేదు, మేమెలా బ్రతకాలి.. ? మిగిలిన బ్యాంకు లోన్లు ఎలా కట్టాలి..? అంటూ ఇప్పటికే మూసీ బాధితులు తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈసీ, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్‌లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.
వెనకటికి ఒకడు ఇల్లు కాలిపోతుంటే బొగ్గులు అమ్ముకోవొచ్చు కదా అన్నాడట
5000 కోట్ల గాంధీ విగ్రహం కాంట్రాక్ట్ నాకు ఇస్తే చేస్తా
కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకూ నన్ను ఇంకా ఎవరూ అడగలేదు
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో ఇల్లు కోల్పోతున్న, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసిన… https://t.co/bxOP7OmNGo pic.twitter.com/haxStLd0HP
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2026
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!