Wife Murder | అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన అమీర్పూర్ పరిధిలో వెలుగు చూసింది. దంపతులు కృష్ణవేణి, వెంకట బ్రహ్మం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కృష్ణవేణి సంగారెడ్డి జిల్లా కోహిర్ డీసీసీబీ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా.. వెంకట బ్రహ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
అయితే కృష్ణవేణి ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త వెంకట్ బ్రహ్మంకు అనుమానం మొదలైంది. ఇదే విషయంలో దంపతులిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరి ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు, 8వ తరగతి చదువుతున్న బాబు ఉన్నాడు. కూతురు హాస్టల్లో ఉంటూ చదువుతుండగా.. కొడుకు ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం వెంకట్ బ్రహ్మం తన భార్య కృష్ణవేణితో గొడవ పడి ఆవేశంలో బ్యాట్‌తో కొట్టి చంపినట్టు సీఐ నరేశ్ వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు