గంటకు 110కి.మీ. స్పీడ్.. అంటే 5 గంటల్లో చీతాలు కూనో ఫారెస్ట్ నుంచి ఢిల్లీ వరకు పరిగెడతాయా?
Cheetah | ఒక్క ఉదుటులో ఏడు మీటర్లు.. సెకనుకు నాలుగు అంగలు.. మూడు సెకన్లలోనే 110 కిలోమీటర్ల వేగం.. ఇదీ చీతాల ప్రత్యేకత ! వీటి ముందు కారు వేగం కూడా సరిపోదు !! అందుకే భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల జీవిగా చీతాలు నిలిచాయి.
Cheetah | ఒక్క ఉదుటులో ఏడు మీటర్లు.. సెకనుకు నాలుగు అంగలు.. మూడు సెకన్లలోనే 110 కిలోమీటర్ల వేగం.. ఇదీ చీతాల ప్రత్యేకత ! వీటి ముందు కారు వేగం కూడా సరిపోదు !! అందుకే భూమ్మీద అత్యంత వేగంగా పరిగెత్తగల జీవిగా చీతాలు నిలిచాయి. మరి వాటికి అంత వేగం ఎలా సాధ్యమైంది? ఆ స్పీడ్‌తో ఎంతసేపు ప్రయాణించగలవు? ఒకసారి చూద్దాం..
చీతాలు అంత వేగంగా పరిగెత్తడానికి వాటి ఆకృతే కారణం. సెకన్లలోనే సూపర్ స్పీడ్ అందుకునేలా.. వేగంగా మలుపులు తిరిగేలా వీటి శరీరం ఉంటుంది. ఒకసారి చీతాల శరీర నిర్మాణాన్ని పరిశీలించి చూడండి. శరీరం చిన్నగా.. నడుం సన్నగా ఉంటుంది. ఇవి కాకుండా చీతాలకు పెద్ద ఊపిరితిత్తులు, గుండె, సులువుగా వంగే వెన్నెముక, పొడవైన కాళ్లు ఉంటాయి. ఇక చీతా శరీరం పొడవులో సగ భాగం తోకనే ఉంటుంది. ఇది చీతాలు పరిగెత్తేటప్పుడు చుక్కానిలా పని చేస్తాయి. 110 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే సమయంలో కింద పడకుండా స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. వేగంగా పరిగెడుతున్న సమయంలో పెరిగిపోతున్న శరీర ఉష్ణోగ్రతను నోరు, పాదాల ద్వారా తగ్గించుకుంటుంది. వాటి చర్మంపై ఉండే నల్లటి మచ్చలు కూడా వేడిని బయటకు పంపించేస్తాయి. దీంతో అవి సులువుగా వంద కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకుంటాయి.

ఎంతసేపు పరిగెడతాయి?
చీతాలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాయి అంటే.. కొన్ని గంటల్లో ఎన్ని ఊళ్లు, రాష్ట్రాలు దాటేస్తాయో అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అవి ఎంత తక్కువ టైమ్‌లో గరిష్ఠ వేగాన్ని అందుకుంటాయో.. అంత తక్కువ టైమ్‌లోనే అలసిపోతాయి. కాబట్టి ఎక్కువసేపు ఆ స్పీడ్‌ను కొనసాగించలేవు. కేవలం 30 నుంచి 40 సెకన్లు మాత్రమే గరిష్ఠ వేగంతో పరిగెడతాయి. అందుకే ఏదైనా జంతువును వేటాడాలంటే చాలాసేపు ఓపిగ్గా ఉండి రంగంలోకి దిగుతాయి. అర నిమిషంలోపు జంతువును చంపలేకపోతే దాన్ని వదిలేస్తాయి. ఒకవేళ జంతువును వేటాడినా కూడా వెంటనే దాని మాంసాన్ని వెంటనే తినలేవు. దాదాపు అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నాకే ఆహారాన్ని తీసుకుంటాయి.
చీతాల గురించి మరికొన్ని విషయాలు
› పులులు, సింహాలు, చిరుతల మాదిరి చీతాలు గర్జించలేవు. పిల్లి కూతలా ధ్వనులు చేస్తుంది. ఎప్పుడైనా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే గుర్రుమని శబ్దం చేస్తాయి.
› చీతాల సగటు జీవితకాలం 10 నుంచి 12 ఏండ్లు. ఇది అడవుల్లో ఉన్నప్పుడు.. అదే సంరక్షణ కేంద్రాల్లో అయితే 20 ఏండ్ల వరకు మనుగడ సాగిస్తాయి.
› చీతాలు 2 నుంచి 5 రోజులకు ఒకసారి మాత్రమే వేటాడతాయి. 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతాయి.
› ఉదయం, సాయంత్రం పూట మాత్రమే చీతాలు వేటాడతాయి.
› చీతాల పిల్లల్లో మరణాల రేటు చాలా ఎక్కువ. పది పిల్లల్లో ఒకటి మాత్రమే మనుగడ సాధించగలదు. అందుకే చీతాల జాతి వేగంగా పెరగదు.
Read More :
మనదేశంలో చీతాలను పెంపుడు జంతువుల్లా పెంచుకునేవారా? అది ఎలా సాధ్యమైంది?
శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట కట్టారు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cheetah
- fastest animal
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

