Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే | మరుగుజ్జులు అంటే తెలుసు కదా. సాధారణంగా ఉండాల్సిన పొడవు కన్నా తక్కువ పొడవు
మరుగుజ్జులు అంటే తెలుసు కదా. సాధారణంగా ఉండాల్సిన పొడవు కన్నా తక్కువ పొడవు ఉన్నవాళ్లను మరుగుజ్జులు లేదా పొట్టివాళ్లు అంటారు. ఒక ఊరిలో మా అంటే ఒకరు ఇద్దరు ఉంటారు కావచ్చు మరుగుజ్జులు. కానీ.. ఒక ఊళ్లో మాత్రం సగం మంది మరుగుజ్జులే. చదవడానికే వింతగా ఉంది కదా. పదండి.. ఇంకాస్త ముందుకెళ్దాం.

ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఆ ఊరు పేరు యాంగ్సి. ఆ ఊరిలో ఉన్న వాళ్లలో సగం మంది మరుగుజ్జులే. అసలు.. ఆ ఊరిలో అంతమంది ఎలా మరుగుజ్జులు అయ్యారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఆ ఊళ్లో ఉన్న మరుగుజ్జుల్లో ఎక్కువ హైటే 3 ఫీట్లా 10 ఇంచులు. తక్కువ హైట్ 2 ఫీట్లా ఒక ఇంచ్.
ఒకవేళ ఆ ఊరి ప్రజలు తినే ఆహారం, ఆ ఊరు నీళ్లు, ప్రాంతం, నేల స్వభావం.. ఇలా వీటిలో దేనివల్ల అయినా వాళ్లు మరుగుజ్జులు అయ్యారేమో అని సైంటిస్టులు ఎన్నో టెస్టులు చేసినప్పటికీ అసలు రహస్యం మాత్రం కనుక్కోలేకపోయారు.

అయితే.. ఆ ఊరికి చెందిన ఓ పెద్దమనిషి ఏమంటాడంటే.. వేసవికాలంలో ఓ రోజు అర్ధరాత్రి సమయంలో ఒక మాయదారి రోగం ఊరిలోని చిన్న పిల్లలకు సోకింది. అది కూడా 5 నుంచి 7 సంవత్సరాలు ఉన్న పిల్లలకే సోకింది. అప్పటి నుంచి ఆ పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయింది. వాళ్లలో కొందరికి కాళ్లు చేతులు పడిపోయాయి. వికలాంగులుగా మారిపోయారు.. అని చెప్పుకొచ్చాడు.
అయితే.. 1997లో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఊరిలోని నేలలో మెర్క్యూరీ సాంద్రత పెరగడం వల్ల అక్కడి ప్రజల్లో పెరుగుదల ఆగిపోయింది అనే విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది.

లేదు లేదు.. జపాన్.. చైనాలో విషపు గ్యాస్‌ను వదిలినప్పుడు.. ఆ విషపు గ్యాస్.. ఈ ఊరిలోకి వ్యాపించింది. అందుకే.. ఇక్కడి ప్రజలు ఎత్తు పెరగలేదు అంటూ మరో వాదన కూడా తెరమీదికి వచ్చింది.
ఇలా ఆ ఊరి మరుగుజ్జుల మీద పలు రకాల వాదనలు తెర మీదికి వస్తున్నప్పటకి… అసలు రహస్యాన్ని మాత్రం ఎవ్వరూ కనుక్కోలేకపోయారు… పైవాటిని ధృవీకరించలేకపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Drug Lab : యూట్యూబ్‌లో వీడియోలు చూసి డ్రగ్స్ తయారు చేశాడు.. అడ్డంగా బుక్కయ్యాడు
రూ.13 కోట్లకు ఆ పార్ట్‌ను ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్
జూకు వెళ్లి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి.. ఈ యువతి ఏం చేసిందంటే? వైరల్ వీడియో
హనుమంతుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు
how to fail UPSC exam : సివిల్స్‌లో ఎలా ఫెయిల్ అవ్వాలి? ఈ వీడియో చూసి తెలుసుకోండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

