గట్టుప్పల్, సెప్టెంబర్ 08 : గట్టుప్పల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయమని ఎంఈఓ అమృతాదేవి అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోని 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం మండలానికి గర్వకారణం అన్నారు. ఇలాగే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది రానున్న రోజుల్లో మరెన్నో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Gattuppal : ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం