నాగర్ కర్నూల్ : జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టాడు. సకాలంలో పోలీసులు స్పందించి అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పింది . నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన రాములు అనే రైతు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చాడు.
తన అన్న 9 ఎకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.