నూతనకల్, సెప్టెంబర్ 08 : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ పనులన్ని వదులుకుని యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి రోజులు, అవే అవస్ధలు మళ్లీ వచ్చాయి ఇదేమి ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు.