కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 08 : ఈ నెల 14వ తేదీన కొత్తగూడెం క్లబ్లో జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలు జరుగనున్నట్టు జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేశ్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకులు సోమవారం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజును మర్యాద పూర్వకంగా కలిసి పోటీలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆధునిక, పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత పెరిగిందని అందులో భాగంగా జిల్లాలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంలో జిల్లా స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ హౌస్ జిమ్ నిర్వాహకులు షమీవుద్దీన్, జెల్లా రాజేశ్, కెడం లారెన్స్ పాల్గొన్నారు.