Road accident : ఆర్టీసీ బస్సు (RTC bus) ను బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర (Maharastra) లోని నాసిక్ జిల్లా (Nashik district) లో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం (Accident) జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. సుకాంత్మాన్ గ్రామానికి చెందిన గోవింద్ కాలు పవార్, వికాస్ జైరామ్ మాలి, రోషన్ దయారామ్ మాలి అనే ముగ్గురు వ్యక్తులు బైకుపై వెళ్తూ.. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్ (MSRTC) కు చెందిన బస్సును ఢీకొట్టారు. బస్సు నందుర్బార్ నుంచి పాల్ఘర్ జిల్లాలోని వసాయ్కి వెళ్తుండగా తహరాబాద్-సతానా రహదారిపై వనోలి గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైకుపై ఉన్న ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బైకు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయి బస్సును ఢీకొట్టడంవల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.