పచ్చి బొప్పాయి తురుము: రెండు కప్పులు, పచ్చి మామిడి తురుము: ఒక కప్పు, క్యారెట్ తురుము: అర కప్పు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు, పల్లీలు: పావు కప్పు, టమాట తరుగు (గింజలు తీసేసి): పావు కప్పు, నిమ్మరసం: అర టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి: ఒకటి, వెల్లుల్లి తరుగు: అర టీ స్పూన్, బెల్లం లేదా చక్కెర: అర టీ స్పూన్, ఉప్పు: ఒక టీ స్పూన్, నువ్వుల నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
ముందుగా పెద్ద గిన్నెలో పచ్చి బొప్పాయి తురుము, పచ్చి మామిడి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. మరోవైపు పల్లీలను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఇంకో గిన్నెలో వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, టమాట తరుగు వేసి పప్పుగుత్తితో రుబ్బుకోవాలి. అందులోనే చక్కెర లేదా బెల్లం, ఉప్పు, నూనె జోడించి మరోసారి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని బొప్పాయి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. చివరగా పల్లీల పొడి, నిమ్మరసం చల్లి సర్వ్ చేయాలి.
“Mixed Fruit Mocktail Recipe | మిక్స్డ్ ఫ్రూట్ మాక్‌టెయిల్ తయారీ విధానం”
Paan shots recipe | పాన్ షాట్స్ తయారీ విధానం”
Coconut Orange Blend Recipe | కోకోనట్ ఆరెంజ్ బ్లెండ్ తయారీ విధానం”
Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం”