INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్‌కు ఓపెనర్ స్మృతి మంధాన(45) మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు హర్లీన్ డియోల్ (45) జెమీమా రోడ్రిగ్స్(50)లు ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టారు. ఈ ముగ్గురు షాన్‌దార్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 రన్స్ చేసింది.
మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ కొట్టింది. రివర్సైడ్ గ్రౌండ్లో ఓపెనర్ స్మృతి మంధాన(45) తనదైన స్టయిల్లో ఇంగ్లండ్ బౌలర్లకు దడ పుట్టిస్తూ బౌండరీలతో విరుచుకుపడింది. ప్రతీకా రావల్(26)తో కలిసి శుభారంభమిచ్చింది. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలతో ఇంగ్లండ్ బౌలర్లను ఒత్తిడిలో పడేశారు. ఈ జోడీ అర్ధ శతక భాగస్వామ్యంతో భారీ స్కోర్‌కు బాటలు వేసింది. తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని చార్లీ డీన్ విడదీసింది. ఆ కాసేపటికే మంధాన అర్ధ శతకానికి ముందు పెద్ద షాట్ ఆడి డంక్లే చేతికి చిక్కింది. దాంతో, 81వద్ద రెండో వికెట్ పడింది.
1⃣0⃣2⃣ runs
8⃣4⃣ deliveries
1⃣4⃣ foursA sensational knock by Captain Harmanpreet Kaur in the series decider 💯👏
Updates ▶️ https://t.co/8sa2H24aBL#TeamIndia | #ENGvIND | @ImHarmanpreet pic.twitter.com/jkv2aRLSLL
— BCCI Women (@BCCIWomen) July 22, 2025
అనంతరం హర్లీన్ డియోల్(45), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(102)లు ధనాధన్ ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు. డియోల్ ఔటయ్యాక జెమీమా రోడ్రిగ్స్(50) జతగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. ఏడో సెంచరీతో చెలరేగిన కౌర్ వెనుదిరిగాక వికెట్ కీపర్ రీచా ఘోష్(38 నాటౌట్), రాధా యాదవ్(2 నాటౌట్)లు ధనాధన్ ఆడడంతో భారత జట్టు ప్రత్యర్థికి 319 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.