Pahalgam Attack : పహల్దాంలోని బసరన్ లోయలో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు అని ప్రకటించింది కూడా. నరమేధానికి పాల్పడిన ఆ టెర్రరిస్టులకు తగిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
మంగశవారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహకాళేశ్వరుడుని భజ్జీ దర్శించుకున్నాడు. దైవ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడిని ఖండించాడు. ‘భూతల స్వర్గమైన జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న వాళ్లను ఉగ్రవాదులు కాల్చి చంపడం దురదృష్టకరం. 28 మందిని హతమార్చిన టెర్రరిస్టులు యావత్ దేశం ఒలిక్కిపడేలా చేశారు. ఈ దాడికి బదులు తీర్చుకునేలా మనం ఏదో ఒకటి చేయాలి. ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడి మనవాళ్లను చంపేస్తుంటే మౌనంగా ఉండొద్దు. ఆ ముష్కరులకు కఠిన శిక్ష పడేలా చూడాలి’ అని భజ్జీ అన్నాడు.
#WATCH | Ujjain, Madhya Pradesh | On the #PahalgamTerroristAttack, AAP MP and former Indian Cricketer Harbhajan Singh says, “This attack is very unfortunate and we all should take strict action against terrorists and it will not be tolerated that someone enters our country and… https://t.co/Isoq4ae0tV pic.twitter.com/NHDEOeflKI
— ANI (@ANI) April 29, 2025
ఏప్రిల్ 22న మధ్యాహ్నం అడవి మార్గం గుండా బసరన్ లోయలో చొరబడిన ఉగ్రవాదులు దారుణానికి తెగబడిన విషయం తెలిసిందే. పిల్లలు, మహిళలను వదిలేసి పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్లను ‘ఐడీ కార్డులు చూపించండి.. మీ మతం ఏంటో చెప్పండి.. అల్లాహూ అక్బర్ అనండి’.. అని ఆదేశించి చివరకు హిందువులుగా గుర్తించిన 26 మందిని కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిని భజ్జీ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఖండించారు… భాదిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సిరాజ్, గిల్.. ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టారు.