IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(55 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు.కోల్కతా స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటున్న డూప్లెసిస్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. మరో ఎండ్లో కెప్టెన్ అక్షర్ పటేల్(22 నాటౌట్) సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. దాంతో, ఢిల్లీ 11 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి పరుగులు 108 చేసింది. ఇంకా విజయానికి 97 రన్స్ కావాలి.
భారీ ఛేదనలో బౌండరీతో ఖాతా తెరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ అభిషేక్ పొరెల్(4).. అనుకుల్ రాయ్ బౌలింగ్లో పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద రస్సెల్ చేతికి చిక్కాడు. దాంతో, 4 పరుగులకే ఢిల్లీ తొలి వికెట్ పడింది. దూకుడుగా ఆడుతున్న కరుణ్ నాయర్(15)ను వైభవ్ అరోరా ఎల్బీగా ఔట్ చేశాడు. అయినా సరే కేఎల్ రాహుల్(7) ఉన్నాడనే ధైర్యంతో ఉన్న ఢిల్లీకి నరైన్ పెద్ద షాకిచ్చాడు. డైరెక్ట్ త్రోతో అతడిని వెనక్కి పంపాడు. అంతే.. ఢిల్లీ కష్టాల్లో పడింది.