కీలక పరిణామం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

గాజా : ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ సైతం ధ్రువీకరించింది. దీంతో 11 రోజులుగా జరుగుతున్న హింసకు తెరపడినట్లయింది. అల్-అక్సా మసీదు వద్ద నిరసనకారులు, పోలీసుల మధ్య ఈ నెల 10న ఘర్షణ చోటు చేసుకోగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరుపగా.. 65 మంది చిన్నారులు సహా 232 మంది పాలస్తీనియన్లు మరణించారు.

1,900 మందికిపైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. మరో వైపు ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీగా రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఇజ్రాయెల్‌లో 12 మంది వరకు మరణించగా.. వందల సంఖ్యలో జనం గాయపడి, చికిత్స పొందుతున్నారు. వైమానికదాడుల్లో పెద్ద ఎత్తున పాలస్తీనియన్లు నిరాశ్రయులవగా.. వేలాది సంఖ్యలో గాజా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుపై అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. మొదటి నుంచి మద్దతుగా ఉన్న అమెరికా సైతం హింసను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించించింది.

ఇరుపక్షాలు దాడులు తక్షణం ఆపివేయాలంటూ ఇస్లామిక్ దేశాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ రాగా.. ఈజిప్ట్, ఖతార్, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాయి. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇజ్రాయెల్ తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొల్పేందుకు ఇదో మంచి అవకాశమని పేర్కొన్నారు. దాడుల్లో మృతి చెందిన ఇజ్రాయెల్, పాలస్తీనియన్లకు సంతాపం ప్రకటించారు. మరో వైపు కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇద్దరు ప్రతినిధులను పంపనున్నట్లు ఖైరో తెలిపింది. కాల్పుల విరమణ ప్రకటనతో దక్షిణ గాజా ప్రాంతంలోని వీధుల్లో పాలస్తీనియన్లు సంబురాలు జరుపుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వారణాసి వైద్యులతో నేడు ప్రధాని భేటీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
కరోనాకు కొత్త మందు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Gaza
- Hamas
- Israel
- palasthina
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

