e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు

రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు

రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు

ఈ రోజు ప్రపంచ హీమోఫిలియా దినం. హీమోఫిలియా అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధికి గురైన వీరికి ఏ చిన్న గాయమైనా కూడా అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమని వైద్యులు చెప్తుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా 5లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్‌-19 వ్యాధి పెద్ద సమస్యగా మారింది. హీమోఫిలియా సమస్య ఉన్నట్లు చాలా మందికి తెలియదు. అందుకని దీని పట్ల అవగాహన, వైద్య చికిత్సలు, తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకొని ఉండడం మంచిది.

మనకు గాయమైన సందర్భంలో గాయం నుంచి కారే రక్తాన్ని ఆపడానికి మన శరీరానికి దాని స్వంత వ్యవస్థ ఉన్నది. గాయమైన చోట ఆటోమేటిక్‌గా రక్తం గడ్డకట్టుకుపోయి రక్తం కారకుండా ఆగిపోతుంది. అదే హీమోఫిలియాతో బాధపడుతున్న వ్యక్తికి గాయం జరిగినప్పుడు రక్తం గడ్డకట్టదు. ఫలితంగా ఏ చిన్న గాయమైనా రక్తం కారుతూనే ఉంటుంది. రక్తంలో థ్రోంబోప్లాస్టిన్ లోపం వల్ల గానీ లేదా గడ్డకట్టే కారకం వల్ల సంభవించే జన్యు వ్యాధి.

జన్యులోపాలతో అనువంశికంగా సంక్రమించే హీమోఫిలియాకు ఎలాంటి సరైన చికిత్స అందుబాటులో లేదు. దీనిని నివారించుట కూడా సాధ్యపడదు.

ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎముకల కీళ్ళలో నొప్పి ఉంటుంది. శరీరంలోని ఏ భాగానికైనా ఆకస్మిక వాపు వస్తుంది. మలం లేదా మూత్రంలో రక్తం కనిపిస్తుంది. శరీరంలో నీలిరంగు గుర్తులు కనిపిస్తాయి. ముక్కు నుంచి, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అవుతుంది. శరీరం యొక్క పెద్ద కండరాలపై రక్తస్రావం కావడం వల్ల పెద్ద గాయాలవుతాయి. సులభంగా చర్మం పాలిపోతుంది.

దంతాలు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం అయితే వెంటనే దంతవైద్యుడికి చూపించుకోవాలి. ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయడం అలవర్చుకోవాలి. ఈ వ్యాధికి సంబంధించి ఏ లక్షణమైనా బయటపడగానే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

ఫ్రాంక్‌ పుట్టినరోజును స్మరించుకుంటూ..

ప్రపంచ హీమోఫిలియా దినంను 1989 లో ప్రారంభించారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫిలియా వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కాన్బెల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 17 న ప్రపంచ హీమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటాం.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2014: ప్రఖ్యాత కొలంబియన్ నవలా రచయిత గ్రాబియల్ మార్క్వెజ్ మరణం

2013: స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన న్యూజిలాండ్‌

2011: గేమ్ ఆఫ్ థ్రోన్స్ మొదటి ఎపిసోడ్ ప్రదర్శన

2003: దాదాపు 55 సంవత్సరాల తరువాత ఏర్పడిన ఇండో-యూకే పార్లమెంటరీ ఫోరం

1997: ప్రముఖ భారతీయ రాజకీయవేత్త, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ మరణం

1995: పాకిస్తాన్‌లో బాల కార్మికుల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన యువ కార్యకర్త ఇక్బాల్ క్రీస్తు దారుణహత్య

1993: భూమికి తిరిగొచ్చిన “ఎస్‌టీఎస్‌-56” డిస్కవరీ అనే అంతరిక్ష నౌక

1990: పాట్నా సమీపంలో రైలు పేలుడులో 80 మందికి పైగా దుర్మరణం

1983: “ఎస్‌ఎల్‌వీ-3” రాకెట్‌ను ప్రయోగించిన భారతదేశం

1982: రాజ్యాంగాన్ని స్వీకరించిన కెనడా

1975 : స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మరణం

1972: శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ జననం

1970: భూమికి సురక్షితంగా తిరిగొచ్చిన అపోలో -13 అనే అంతరిక్ష నౌక

1946: ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సిరియా

1875: స్నూకర్‌ను కనుగొన్న సర్ నెవిల్లే చాంబర్లిన్

1790 : బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ మరణం

ఇవి కూడా చదవండి..

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

టీకా ఆఫ‌ర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోట‌ల్స్‌

స‌ముద్రంలో వంద‌లాది ప‌డ‌వ‌ల మోహ‌రింపు.. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న పీఎల్ఏ

భార‌త్‌లో బోరిస్ జాన్స‌న్ ప‌ర్య‌ట‌న కుదింపు

చంద్రుడిపై రోవ‌ర్‌ను పంపేందుకు జ‌పాన్‌తో జ‌త‌క‌ట్టిన అర‌బ్ ఎమిరేట్స్

జూన్ 1 నుంచి హాల్‌మార్క్ న‌గ‌లే అమ్మాలి..

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement