తాండూర్ : పట్టణంలోని బోయపల్లి హనుమాన్ దేవాలయం, మాదారం టౌన్ షిప్‌లోని కోదండ రామాలయంతో పాటు పలు ఆలయాలలో శనివారం శ్రీరామ పట్టాభిషేకం ( Pattabhishekam ) వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోయపల్లిలో పూజారి జగదీష్, మాదారం కోదండరామాలయంలో ఆలయ అర్చకుడు, వేదపండితులు ముద్దు అవధూత శర్మ, వివిధ ఆలయాలలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

తాండూర్ గ్రామంలో హనుమాన్ స్వాములు వివిధ ఆలయాల వరకు భజనలు చేస్తూ నగర సంకీర్తన చేపట్టారు. మాదారంలో హనుమాన్ స్వాములు ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా స్టీల్ గాసులు వాడి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు పద్మ విజయభాస్కర్ రెడ్డి, బెల్లంపల్లి ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ ఉమాకాంత్ కృష్ణకుమారి దంపతులు, సుబ్రమణ్యం దంపతులు, మాసాడి శ్రీదేవి శ్రీరాములు దంపతులు, తిరుపతి అంజలి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.