Redmi 15A : చైనాకు చెందిన మొబైల్ సంస్థ రెడ్మి తాజాగా రెడ్మి 15ఏ పేరుతో 5జీ ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో రెడ్మి 15 సిరీస్ మంచి విజయం సాధించింది. దీనిలో భాగంగా తాజాగా ఈ సిరీస్ నుంచి కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. ధర బడ్జెట్లోనే ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, ఎమ్ఐ.కామ్ ద్వారా ఆన్లైన్లో, షావోమీ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏస్ బ్లాక్, ఆసమ్ బ్లూ, అమేజ్ పర్పుల్ కలర్స్‌లో లభ్యం.
ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి. 6.9 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 60 హెర్జ్ టు 90 హెర్జ్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఆక్టాకోర్ టీ8300 5జీ ప్రాసెసర్ విత్ మాలి జీ57 జీపీయూ, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, 32 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అండర్ వాటర్ డ్రాప్ నాచ్, 6,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 7.5 వాట్స్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్, 210 గ్రాముల బరువు, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ విత్ షావోమీ హైపర్ ఓఎస్ 3 ఇంటర్ఫేస్, ఐపీ52 రేటింగ్, 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.12,999 / రూ.14,499 / రూ.16,499. వివిధ కార్డులపై డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి.