– ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనివాసరాజు
రామగిరి, మార్చి 28 : విద్యార్థులు సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు జీవన నైపుణ్యాలు అలవర్చుకోవాలని నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శ్రీనివాసరాజు అన్నారు. కళాశాల రసాయనశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 నుండి మార్చి 4 వరకు ‘జీవన నైపుణ్యాలు- సానుకూల మనస్తత్వ శాస్త్రం” అనే అంశంపై నిర్వహించిన సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు శనివారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించడానికి, జీవితంలో విజయం పొందడానికి జీవన నైపుణ్యాలు చాలా అవసరమన్నారు. పాజిటివ్ సైకాలజీని జీవనశైలిగా మార్చుకున్నప్పుడు ప్రతి రోజు ఉల్లాసంగా ఉండవచ్చన్నారు. కోర్స్ కో ఆర్డినేటర్ నరేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ సుంకరి రాజారామ్, కెమిస్ట్రీ హెచ్ఓడీ వసంత, సీఓఈ వెంకటకృష్ణ, అధ్యాపకులు మల్లీశ్వరి, పుష్పాలత, చైతన్య సుధ, దయానంద్, శ్రీనివాసులు, రామిరెడ్డి పాల్గొన్నారు.