బూర్గంపహాడ్, మార్చి 28 : బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్, సారపాక పంచాయతీల్లో 2026-2027 ఆర్ధిక సంవత్సరానికి గాను వారాంతపు సంత వేలం పాటలకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని ఆయా పంచాయతీల సర్పంచులు బొర్రా సుభద్ర, గుగులోత్ కిశోర్నాయక్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. మోరంపల్లిబంజర్ పంచాయతీలో సోమవారం ఉదయం 11 గంటలకు, సారపాక పంచాయతీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సంత వేలం పాటలు ఉన్నతాధికారుల సమక్షంలో జరుగుతాయని, నిబంధనలకు అనుగుణంగా జరిగే వేలం పాటలకు పాటదారులు సకాలంలో హాజరవ్వాలని, పూర్తి వివరాలకు పంచాయతీల్లో సంప్రదించాలని వారు కోరారు.