రామవరం, సెప్టెంబర్ 02 : సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేస్తున్నందుకుగాను బహుమతులను అందుకోవడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 55వ రక్షణ పక్షోత్సవాల పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కొత్తగూడెం ఏరియాకు గత నెల 31న ఎంఎన్ఆర్ గార్డెన్స్ శ్రీరాంపూర్‌లో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, విశిష్ట అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా హాజరయ్యారయ్యారు.
కొత్తగూడెం ఏరియాకు జె.వి.ఆర్. ఓసీ. II కి ఉపరితల గనుల గ్రూప్-1 విభాగంలో మొదటి బహుమతి, కిష్టారం ఓసి కి ఉపరితల గనుల గ్రూప్-3 విభాగంలో ద్వితీయ బహుమతి అలాగే గ్రూప్-3 కాంట్రాక్ట్ వర్కర్స్ విభాగంలో మొదటి బహుమతి, అండర్ గ్రౌండ్ గ్రూప్-1 విభాగంలో పద్మావతి గని మైన్ కు ద్వితీయ బహుమతి, అలాగే మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ విభాగాల్లో కొత్తగూడెం ఏరియా ఎంవిటీసీకి ద్వితీయ బహుమతి లభించింది.