Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకల్లో అభిమానులు అత్యుత్సాహం చూపించారు. భారీ శబ్దాలతో బైక్‌లపై స్టంట్లు చేస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగకుండా ఇలా న్యూసెన్స్ చేయడమేంటని ప్రశ్నించిన స్థానికులపై దాడికి దిగబడ్డారు. ఈ ఘటనలో ఓ స్కూల్ విద్యార్థినికి గాయాలయ్యాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.
సెప్టెంబర్ 2న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో పవన్ కల్యాణ్ అభిమానుల వేడుకలు శ్రుతి మించాయి. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా భారీ శబ్దాలతో బైక్ స్టంట్స్ వేస్తూ నానా అల్లరి చేశారు.
పవన్ కల్యాణ్ అభిమానులు చేస్తున్న అల్లరితో విసిగెత్తిపోయిన స్థానికులు ఇదేంటని వారిని నిలదీశారు. జనాలు ఉండే దగ్గర ఇలా పెద్ద పెద్ద సౌండ్లతో న్యూసెన్స్ చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానికులపై దాడికి దిగారు. ఈ క్రమంలో స్థానికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఒకరిపైఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ విద్యార్థిని గాయపడింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శృతి మించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు
ఇదేంటని ప్రశ్నించిన స్థానికులను కొట్టిన పవన్ అభిమానులు
భారీ శబ్దాలతో బైక్ స్టంట్స్ చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులపై పవన్ కళ్యాణ్ అభిమానుల దాడి
ఇరు వర్గాలు రాళ్ళు రువ్వుకోవడంతో స్కూల్ విద్యార్థినికి గాయాలు
అంబేద్కర్… pic.twitter.com/pnfzgRgiM1
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2025