Pulsar bike : బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ ర్యాలీలో బైకు పోగొట్టుకున్న ఓ దాబా ఓనర్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం కొత్త బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆగస్టు 27న దర్బంగాలో రాహుల్ గాంధీ రోడ్‌షో, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ మార్గంలో పార్క్ చేసిన బైక్‌లను భద్రతా సిబ్బంది ఆ ర్యాలీకి ఉపయోగించారు.
వాటిలో ఓ దాబా యజమాని శుభమ్‌కు చెందిన పల్సర్ 220 బైక్ కూడా ఉంది. శుభమ్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రతా సిబ్బంది టీ తాగడానికి తన దాబా దగ్గర ఆగారు. టీ తాగిన తర్వాత రోడ్ షో కోసం బైక్ కావాలని అడిగారు. ఈ రోడ్ షో కేవలం 1.5 కిలోమీటర్ల మాత్రమే ఉంటుందని, తర్వాత తిరిగిస్తామని హామీ ఇచ్చారు. శుభమ్ అంగీకరించడంతో అతడిని కూడా తమతో తీసుకెళ్లారు. కానీ కొంతదూరం వెళ్లిన తర్వాత శుభమ్‌ను ఒక కారులో ఎక్కించారు.
ర్యాలీ ముగిసిన తర్వాత శుభమ్‌కు తన బైకు కనిపించలేదు. ఎంత వెతికినా తన బైకుగానీ, తన దగ్గర బైకు అడిగి తీసుకున్న భద్రతా సిబ్బందిగానీ కనపడలేదు. తర్వాత భద్రతా సిబ్బందికి ర్యాలీ ప్రాంతంలో ఆరు బైక్‌లు లభ్యమయ్యాయి. అయితే అందులో శుభమ్ బైకు లేదు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకుడు శుభమ్ యాదవ్‌కు తెలిసింది. దాంతో ఆయన శుభమ్‌ను పట్నాకు రావాలని ఆహ్వానించాడు.
దాంతో పట్నాలో జరిగిన ఓటర్ అధికార్ యాత్ర ముగింపు కార్యక్రమ వేదిక వద్దకు శుభమ్ వెళ్లాడు. ఆ వేదికపై రాహుల్ గాంధీ స్వయంగా తనకు కొత్త బైకు తాళాలు అందించారు. ర్యాలీలో తాను కోల్పోయిన మోడల్ బైకు రాహుల్‌గాంధీ తనకు బహుమతిగా ఇచ్చారని శుభమ్ తెలిపారు.
During the ‘Voter Adhikar Yatra’ bike rally in Darbhanga, Bihar, a young man’s bike went missing.
Rahul Gandhi has gifted him a new bike. People called him Jan Nayak for a reason ❤️
pic.twitter.com/LCuvuz5jRC— Surbhi (@SurrbhiM) September 1, 2025