Mackay Ground : క్రికెట్లో ఆటగాళ్లకే కాదు కొన్ని మైదానాలకు కూడా చరిత్ర ఉంటుంది. తొలి మ్యాచ్ జరగడం నుంచి చిరస్మరణీయ విజయాలకు కేరాఫ్ అయిన స్టేడియాలు అభిమానులకు ఎప్పుడూ గుర్తిండిపోతాయి. అయితే.. సుదీర్ఘ విరామం తర్వాత ఒక మైదానంలో మొదటిసారి వన్డే మ్యాచ్ జరిగింది. అది కూడా 33 ఏళ్ల తర్వాత. ఇంకేముంది అరుదైన రికార్డు ఆ గ్రౌండ్ సొంతమైంది. ఇంతకూ ఈ స్టేడియం ఎక్కడుందో తెలుసా.. ఆస్ట్రేలియాలో.
వన్డే వరల్డ్ కప్ 1992 పోటీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు ‘ది గ్రేట్ బారియర్ రీఫ్’ అరీనా లోని మెకే (Mackay) మైదానంలో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. అప్పటినుంచి ఇక్కడ వన్డే మ్యాచ్‌లు జరగలేదు. ఈమధ్యే వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఈ స్టేడియంలో ఎదురుపడ్డాయి. అంటే.. 33 ఏళ్ల విరామం తర్వాత ఈ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ నిర్వహించారు. దాంతో.. క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువ రోజుల తర్వాత మ్యాచ్ జరిగిన స్టేడియంగా గుర్తింపు సాధించింది మెక్కే.
Mackay in Australia hosted a one-day international again recently for the first time in 33 years. Was this a record gap for a single venue?
Find out on #AskSteven 👉 https://t.co/SVDrIWhlWP pic.twitter.com/E2bS7Qyytx
— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2025
సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగని మైదానాల జాబితాలో ఇంగ్లండ్‌లోని సెయింట్ గార్జెస్ పార్క్ (St George’s Park) మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 1914 నుంచి 1949 మధ్య ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో క్రికెట్ సందడి నెలకొంది. రెండో స్థానంలో మెక్కే స్టేడియం ఉండగా.. ఇంగ్లండ్ బర్మింగ్హమ్లోని ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) గ్రౌండ్ మూడో స్థానంలో నిలిచింది. 1929 నుంచి 1957 వరకూ .. 28 ఏళ్లలో ఇక్కడ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించలేదు. అయితే.. 1957 నుంచి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిస్తోంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.