రావల్పిండి: ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓవర్లలో 178/7 స్కోరుకు పరిమితమైంది.
దుష్మంత చమీర (4/20) వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో చమీర..మూడు పరుగులే ఇచ్చి ఫహీమ్ అష్రఫ్(7) వికెట్ తీసి లంక ఉత్కంఠ విజయంలో కీలకమయ్యాడు. తన బౌలింగ్ వైవిధ్యంతో పాక్ ఆఖరి వరుస బ్యాటర్లను కట్టుదిట్టం చేస్తూ చమీర..లంకకు విజయాన్ని కట్టబెట్టాడు. కెప్టెన్ సల్మాన్ ఆగా (63 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించినా సహచరులు విఫలమయ్యారు. ఇషాన్ మలింగ (2/54)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత లంక 20 ఓవర్లలో 184/5 స్కోరు చేసింది. కమిల్ మిశారా (76) అర్ధసెంచరీతో రాణించాడు. అబ్రార్ అహ్మద్(2/28) రెండు వికెట్లు తీశాడు.