Kajol | తప్పు చేసి పట్టించుకోవద్దు అంటే ఎలా.. మరోసారి కాజోల్‌పై విమర్శల వర్షం
Kajol | బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల పాల్గొన్న టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న ఈ చర్చా కార్యక్రమానికి కాజోల్‌తో పాటు ట్వింకిల్ ఖన్నా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్ , కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు.ఈ ఎపిసోడ్లో జరిగిన సంభాషణలో భాగంగా కాజోల్ మాట్లాడుతూ.
Kajol | బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల పాల్గొన్న టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ప్రసారమవుతున్న ఈ చర్చా కార్యక్రమానికి కాజోల్‌తో పాటు ట్వింకిల్ ఖన్నా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్ , కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు.ఈ ఎపిసోడ్లో జరిగిన సంభాషణలో భాగంగా కాజోల్ మాట్లాడుతూ.. “పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి. అవసరమైతే రెన్యూవల్ ఆప్షన్ కూడా ఉండాలి. నచ్చనివారితో బలవంతంగా కొనసాగడం ఎందుకు?” అని వ్యాఖ్యానించింది. ట్వింకిల్ ఖన్నా కూడా దీనికి మద్దతు పలికింది. అయితే, గెస్టులుగా ఉన్న విక్కీ కౌశల్, కృతి సనన్ మాత్రం ఈ ఆలోచనను తప్పుడు అభిప్రాయం అని పేర్కొంటూ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో కూడా కాజోల్ కామెంట్‌పై భారీ విమర్శలు చేశారు. ఇవి సంబంధాల విలువను తక్కువ చేయడం, సమాజంపై నెగటివ్ ఇంపాక్ట్, పబ్లిక్ ఫిగర్స్‌గా బాధ్యత లేకుండా మాట్లాడటం కిందకే వస్తాయి. ఇలాంటి కామెంట్స్ చేయడం మీకు తగునా అని కాజోల్, ట్వింకిల్ ఇద్దరినీ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పెరుగుతున్న విమర్శల నేపథ్యంలో ఇద్దరు హోస్టులు క్లారిఫికేషన్ ఇచ్చారు.కాజోల్ స్పందిస్తూ ..“మనల్ని సమస్యల్లోకి నెట్టిన సెక్షన్ ఇది. షోలో సరదాగా జరిగిన సంభాషణలను ఇలా సీరియస్‌గా తీసుకోవద్దు” అని తెలిపింది.
ట్వింకిల్ ఖన్నా కూడా..“ఈ షోలో చెప్పే మాటలు పూర్తిగా హ్యూమర్ మాత్రమే. మొదటి ఎపిసోడ్ నుంచే డిస్క్లైమర్ కూడా ఇస్తున్నాం” అని వివరణ ఇచ్చింది. అయితే ఈ వివరణను కూడా నెటిజన్స్ స్వీకరించలేకపోతున్నారు. ముందు ఇష్టానుసారంగా మాట్లాడి, తర్వాత ఇది సరదా అని తప్పించుకోవడం కరెక్ట్ కాదు , పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పిన మాటలకు బాధ్యత ఉండాలి అంటూ మరింత విమర్శిస్తున్నారు. మొత్తానికి కాజోల్ లేనిపోని చిక్కుల్లో పడింది అని చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

