Cyclone Ditwah | దూసుకొస్తున్న దిత్వా తుపాన్.. ఏపీలోని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. రేపు తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
Cyclone Ditwah | నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను ఉత్తర వాయవ్య దిశగా వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ట్రికోమలికి వాయువ్యంగా 80 కి.మీ.లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330కి.మీ.లు, చెన్నైకి దక్షిణంగా 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన ఆరు గంటల్లో 7 కి.మీ.లు వేగంతో తుపాన్ కదిలింది.
రేపు తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యా, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్ నేపథ్యంలో మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

