Road Accident | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బీదర్‌లో కారు, వ్యాను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం డీటీడీసీ కొరియర్ వ్యాను, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులు తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ వాసులు నవీన్ (22) (డ్రైవర్), రాజప్ప(45), నాగరాజు(48) కాశీనాథ్గా గుర్తించారు. గాయపడిన ప్రతాప్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘనగాపుర్ దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించిన అనంతరం తిరుగుప్రయాణంలో వీరు ప్రమాదానికి గురయ్యారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?
Operation Chhatru | జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. కొనసాగుతోన్న ఆపరేషన్ ఛత్రు
Train | యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు