Dies Irae | మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ లాల్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న తాజా చిత్రం ‘డీయస్ ఈరే’. ఈ సినిమాకు బ్రహ్మయుగం దర్శకుడు రాహుల్ సదశివన్ దర్శకత్వం వహించగా మలయాళంలో ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం తెలుగులో నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతుంది.