Train |ఉత్తరప్రదేశ్ (UP)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు (Train) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మీర్జాపూర్ (Mirzapur)లోని చునార్ జంక్షన్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చోపన్ – ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ చునార్ స్టేషన్ ప్లాట్ఫామ్ 4 వద్ద వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణికులు దిగి.. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా పట్టాలు (railway track) దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Earthquake | ఇండోనేషియాని వణికించిన భారీ భూకంపం.. వారం వ్యవధిలో రెండోసారి
Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ