Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. హైదరాబాదీ మహిళ గజాలా హాష్మీ
Ghazala Hashmi | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ (Virginias New Lieutenant Governor)గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు.
Ghazala Hashmi | అమెరికా (America)లో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు (Democrat) తమ సత్తా చాటారు. యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక వర్జీనియాలో జరిగిన ఎల్జీ ఎన్నికల్లో మరో భారత సంతతికి చెందిన మహిళ సత్తా చాటారు.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ (Virginias New Lieutenant Governor)గా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ (Ghazala Hashmi) విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు.. హైదరాబాద్ వాసి కూడా.
హైదరాబాద్‌లో పుట్టి..
గజాలా హాష్మీ.. 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ, తన్వీర్ హాష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మల్‌పేట్‌లోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఓ యూనివర్శిటీలో ప్రోఫెసర్‌గా పని చేసేవారు. ఇక గజాలా.. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.
Also Read..
Zohran Mamdani | అమెరికాలో భారత సంతతి హవా.. న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ విజయం
US Plane Crash | అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Canada Visa | భారతీయుల తాత్కాలిక వీసాలు రద్దు.. కెనడా ప్రభుత్వం మరో షాక్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

