Zohran Mamdani | అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారతతి సంతతికి చెందిన వ్యక్తులు, డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు. యూఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్, వర్జీనియాలో జరిగిన తాజా ఎన్నికల్లో డెమోక్రటిక్ (Democrat) పార్టీ అభ్యర్థులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు విజయం సాధించారు.
న్యూయార్క్ (New York City) మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) విజయం సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం (Muslim mayor), భారత సంతతి, ఆఫ్రికన్ సంతతికి చెందిన తొలి మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. 34 ఏండ్ల మమ్దానీ జూన్‌లో జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగా నిలిచారు. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మమ్దానీ విజయం సాధించారు.
ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు.మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాలా హాష్మీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా.
Also Read..
US Plane Crash | అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Canada Visa | భారతీయుల తాత్కాలిక వీసాలు రద్దు.. కెనడా ప్రభుత్వం మరో షాక్
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీ ముందంజ