న్యూయార్క్ : మంగళవారం జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఆధిక్యంలో ఉన్నారు. 34 ఏండ్ల మమ్దానీ జూన్లో జరిగిన డెమోక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ అభ్యర్థిగా నిలిచారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీ ముందంజలో ఉన్నట్టు పలు పోల్ సంస్థలు ప్రకటించాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో కంటే మమ్దానీ మెరుగైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు.
అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు.