చందూర్ , మే 6: బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్రామంలోని పార్టీ కార్యకర్త లకావత్ సుభాష్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని కోరారు. బాజిరెడ్డి వెంట సర్పంచ్ మాధవరెడ్డి, పార్టీ నాయకులు మాముళ్ల శ్రీను, పోశెట్టి తదితరులు ఉన్నారు.