నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపి ఉంచొద్దని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు.
- డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, మే 6 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపి ఉంచొద్దని సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్‌పై సీఎం త్రీవ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్ కోసం సామాన్య ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను ఆపి ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
సీఎం ఆదేశాలతో డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రా ఫిక్ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థా యి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ సమస్యలను శాశ్వాతంగా పరిష్కరించడానికి త్వరలోనే ప్రత్యేకంగా ‘ట్రాఫిక్ బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇకపై వీఐపీ కాన్వాయ్‌లు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా, సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయం సిద్ధం చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

