ప్రేమలోని చీకటి కోణం
నందు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ్ స్వరూప్ దర్శకుడు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
నందు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘అగ్లీ స్టోరీ’. ప్రణవ్ స్వరూప్ దర్శకుడు. సుభాషిని, కొండా లక్ష్మణ్ నిర్మాతలు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను ‘భీమ్లానాయక్’ ఫేమ్ దర్శకుడు సాగర్ కె చంద్ర విడుదల చేశారు. ప్రతీ ప్రేమకు ఓ చీకటి కోణం ఉంటుందని, ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే ఈ సినిమా లక్ష్యమని దర్శకుడు ప్రణవ్ స్వరూప్ తెలిపారు. లోతైన భావోద్వేగాలు కలిగిన సినిమా ఇదని హీరో నందు అన్నారు. ప్రేమలోని చేదు నిజాలను చూపించే చిత్రమిదని కథానాయిక అవికా గోర్ చెప్పింది. మంచి క్వాలిటీతో విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ప్రణవ్ స్వరూప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

