మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 16 : వరంగల్ ఎంపీ కడియం కావ్యకు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసే అర్హత లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ 3వ వార్డ్ కౌన్సిలర్ తుర్పూటి రవి పేరున సోమవారం పార్టీ యువజన జిల్లా అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డితో కలిసి ఆమె కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ 2025 సంవత్సరంలోనే వరంగల్ కార్పొరేషన్లో కావ్య ఓటు నమోదు చేసుకున్నారని, మళ్లీ కేవలం రాజకీయ అవకాశం కోసమే ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేసేందకు నమోదు చేసుకున్నదని, ఎలా ఓటు వేస్తుందని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన నిబంధనల ప్రకారం ఎంపీ కడియం కావ్యకు ఓటు వేసే అవకాశం ఇవ్వొవద్దని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.