హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మేనెల కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది. 23న అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు వివరించింది.