మాచారెడ్డి, ఏప్రిల్ 23 : మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు మాచారెడ్డికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గజ్యానాయక్‌తండా,ఎక్స్‌రోడ్‌లో బుధవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హాజరయ్యే ఈ కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పార్టీ మండల అధ్యక్షుడు పగడాల బాల్‌చంద్రం కోరారు.