కడ్తాల్, అక్టోబర్ 13 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల్ మండలంలోని 765 కేవీ హైటెన్షన్ విద్యుత్‌లైన్ బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు హైటెన్షన్ విద్యుత్‌లైన్ ఏర్పాటుతో జరిగే నష్టాల గురించి రైతులు వివరించి, ఆయనకు వినతిపత్రం అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నేతృత్వంలో.. బాధిత రైతులతో కలిసి ఢిల్లీకి వెళ్లి సంబంధిత శాఖ అధికారులతో చర్చించడంతోపాటు, న్యాయ సాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ కడ్తాల్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ ఉన్నారు.
కేటీఆర్‌ను కలిసిన దండెం రాంరెడ్డి
పెద్దఅంబర్‌పేట : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నందినగర్‌లోని నివాసంలో పెద్దఅంబర్‌పేటకు చెందిన పార్టీ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.