కుత్బుల్లాపూర్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా నగర్ ఎక్స్ రోడ్ దగ్గర కారును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ (38 ) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిది సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
స్థానికులు క్షతగాత్రుడిని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.