ముంబై, అక్టోబర్ 13 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం టారిఫ్‌ను విధిస్తూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.
దీంతో దేశీయ సూచీలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రారంభంలోనే 500 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 173.77 పాయింట్లు కోల్పోయి 82,327.05 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 25,227.35 వద్ద స్థిరపడింది.