కారేపల్లి, సెప్టెంబర్ 15 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రానికి చెందిన తురక సర్వేశ్వరరావు (41) కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో 2000-01 సంవత్సరంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన మిత్ర బృందం సోమవారం సర్వేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. వాట్సాప్ వేదికగా స్నేహితులంతా నగదును సేకరించి వచ్చిన మొత్తం రూ.14,600ను కుటుంబ సభ్యులకు అందించారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకుడు షేక్ గౌసుద్దీన్ మృతుడు సర్వేశ్వరరావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశాడు. ఈ కార్యక్రమాలలో మిత్రులు జిట్టబోయిన శ్రీనివాసరావు, పెద్దమ్మ మల్లేశ్, కేలోతు నరేశ్, జూపల్లి వెంకటరమణ, షరీఫ్, జంగా మధు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకుడు ఖలీల్ ఉల్లా ఖాన్, కుల పెద్దలు తురక రాంబాబు, తురక రవి, కోటి, శ్రీనివాసరావు, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Karepally : స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత