– కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
– కలెక్టరేట్ ఏఓ, ఎస్సీని కలిసి వినతిపత్రం అందజేత
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 15 : రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను చూపించారనే కక్ష్యతో టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా వేయాలని టీయూడబ్ల్యూజే- 143 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జాతీయ కౌన్సిల్ సభ్యుడు జునుమాల రమేశ్, టీడబ్ల్యూఏఎఫ్ రాష్ట్ర నాయకుడు దాసరి కటేశ్వరరావు (డీవీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓ రామకృష్ణ, జిల్లా ఎస్పీ బి.రోహిత్‌రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలను ప్రపంచానికి చూపెడుతున్నాడనే అక్కసుతో అక్రమ కేసులు పెట్టడం దారణమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల విధులకు ఆటంకం కలిగిస్తే ఎటువంటి కేసులు నమోదు చేస్తారో అలాంటి కేసులను జర్నలిస్టులపై నమోదు చేయడం సిగ్గుచేటన్నారు.
కేసులు నమోదు చేసి జర్నలిస్టుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనుకుంటే కుదరదని, ఎన్ని ఆటంకాలైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రపంచానికి చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ దమనకాండను అడుగడుగునా ఎండగడతామని, కేసులను ఉపసంహరించుకోని పక్షంలో జర్నలిస్టులంతా ఏకమై ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చండ్ర నర్సింహారావు, దాట్లా రవీందర్, వట్టికొండ రవి, కృష్ణ గోవింద్, తోట శ్రీనివాస్, బానోతు వీరు, ఇల్లెందుల దుర్గ, వాసాల చంద్రశేఖర్, కందుకూరి ఈశ్వర్, సీమకుర్తి రామకృష్ణ, షఫీ, సంజీవ్, ప్రభాకర్‌రెడ్డి, టీవీ9 రవి, తోట రామకృష్ణ, శేషయ్య, అంతడుపుల రాజా శేఖర్, రాము, బానోతు రాందాస్, సురేష్, బీర రవికుమార్, రాజ్ కుమార్, అనిల్ సాహు, శేఖర్, ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ విలేకరులు పాల్గొన్నారు.
Kothagudem Urban : ‘జర్నలిస్టులపై అక్రమ కేసులను భేషరతుగా ఎత్తివేయాలి’
జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అన్నవరపు సత్యనారాయణ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. యూరియా కష్టాలపై రైతుల అభిప్రాయాలను తెలియజేసినందుకు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా నమోదు చేసిన కేసు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించినా కేసులు నమోదు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని భేషరతులగా కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో బీఆర్ఎస్ నాయకులు డిష్ నాయుడు, దాసరి నాగేశ్వరరావు, సమ్మయ్య గౌడ్, వీరన్న, ఆనందర్, అక్బర్, ఆరే సురేష్, మంజుల, పత్తిపాటి శ్రీను, ఆర్వో.రమణ, దాబా శంకర్, రాంబాబు, నరకట్ల రాజశేఖర్, దుర్గాప్రసాద్, సేవియా, రమాకాంత్, అచ్చ నరేందర్ పాల్గొన్నారు.
Kothagudem Urban : ‘జర్నలిస్టులపై అక్రమ కేసులను భేషరతుగా ఎత్తివేయాలి’