Farmers | చిలిపిచెడ్, అక్టోబర్ 13 : చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో వరి పంటలో దోమపోటు – సుడిదోమ, కంకి నల్లి , మెడ విరుపు తెగులు గమనించడం జరిగిందని… రైతులు సుడిదోమను గమనించిన వెంటనే పొలంలో నీటిని తగ్గించాలని మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్ సూచించారు.
సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో వరి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరిలో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ట్రైఫ్లూమెజోపైరం లేదా ఇమిడాక్లోప్రిడ్ 40% +ఇతిప్రోల్ 40%WG – 0.25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వరిలో కంకినల్లి నివారణకు స్పైరో మెసిఫేన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. అలాగే వరిలో మెడవిరుపు తెగులు గమనించినట్లైతే నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథాయోలేన్ మి.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఏవో వెంట ఏఈఓ అనిత, కృష్ణవేణి మరియు రైతులు రాంరెడ్డి, రాజు, అశోక్ , సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్