e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News నేత‌లు కావాల‌న్న ఆతృత‌లో మిగిలిపోతున్న రైతు స‌మ‌స్య‌లు: స‌ర్దార్ వీఎం సింగ్‌

నేత‌లు కావాల‌న్న ఆతృత‌లో మిగిలిపోతున్న రైతు స‌మ‌స్య‌లు: స‌ర్దార్ వీఎం సింగ్‌

నేత‌లు కావాల‌న్న ఆతృత‌లో మిగిలిపోతున్న రైతు స‌మ‌స్య‌లు: స‌ర్దార్ వీఎం సింగ్‌

మీర‌ట్ : రైతుల ఆందోళ‌న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ నాయ‌కులు కావాల‌న్న ఆతృత‌, ఉబ‌లాటంలో రైతు స‌మ‌స్య‌లు అలాగే మిగిలిపోతున్నాయ‌ని రాష్ట్రీయ కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ట‌న్ జాతీయ అధ్య‌క్ష‌డు స‌ర్దార్ వీఎం సింగ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రైతు నాయ‌కులు కావ‌డానికి రేసులో ఉన్నవారు రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోక‌పోతే ఇంకా లాభ‌మేంట‌ని ప్ర‌శ్నించారు. రైతులు నాయ‌కులుగా మార‌డం మంచిదే, అయితే, ఇదే స‌మ‌యంలో రైతుల స‌మ‌స్య‌లు కూడా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉన్న‌ద‌న్నారు. రైతు ఉద్య‌మంలో రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. మీర‌ట్ వ‌చ్చిన‌ ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు.

రైతుల ప్రయోజనాల కోసం మరింత మంచి చేయటానికి దేవుడు వారికి కొంచెం జ్ఞానం ఇవ్వాల‌ని వీఎం సింగ్ కోరారు. మీ కోసం మాత్రమే కాకుండా రైతులకు కూడా మంచి చేయండని రైతు నేత‌ల‌కు సూచించారు. ఉద్యమాన్ని సరైన దిశలో తీసుకుపోవ‌డం ద్వారా కేంద్రం మ‌న మాట వినేలా చేసుకోవ‌చ్చున‌న్నారు. రైతు బ‌తికేలా, రైతుల ఇంట్లో ప్ర‌యోజ‌నం చేకూరేలా వ‌చ్చే ఆగస్టు 9 న మ‌రో రైతు ఉద్య‌మం చేప‌ట్టేలా ప్ర‌ణాళిక త‌యారుచేస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 న ఢిల్లీలో జరిగిన ఆందోళ‌న‌ల తర్వాత‌ నేను కొంత‌ వెనక్కి తగ్గిన మాట వాస్త‌వ‌మే, ఎందుకంటే ఉద్యమ స్వభావంతో నాకు సమస్య ఉన్న‌ద‌న్నారు. రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నామని, అదే కొనసాగిస్తామని చెప్పారు. ఎంఎస్‌పీపై గోధుమలను విక్రయించడానికి రైతులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఎల్ఓసీపై 3 నెల‌లుగా ఒక్క బుల్లెట్ పేల‌లేదు : జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణె

వానాకాలం క‌రోనా వైర‌స్‌తో జాగ్ర‌త్త‌.. ఇవి పాటించండి..!

ఎల్లుండి నుంచి ఎంపీలో అన్‌లాక్ : మార్గ‌ద‌ర్శ‌కాలు వెల్ల‌డి

ఆరేండ్ల క్రితం కేసులో హైకోర్టు తీర్పు.. ధ‌ర్మ‌సంక‌టంలో పిన‌రాయి ప్ర‌భుత్వం

తొలి హిందీ వార్తాపత్రిక ప్రారంభం.. చ‌రిత్ర‌లో ఈరోజు

చైనాలో క‌ల‌వ‌ర‌పెడుతున్న కొత్త ర‌కం స్ట్రెయిన్

లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేత‌లు కావాల‌న్న ఆతృత‌లో మిగిలిపోతున్న రైతు స‌మ‌స్య‌లు: స‌ర్దార్ వీఎం సింగ్‌

ట్రెండింగ్‌

Advertisement