హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం మంజూరు చేసిన క్షమాభిక్షకు అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను తెలంగాణ కారాగారాలు, సంసరణ సేవల శాఖ మంగళవారం విడుదల చేసింది. వారిలో 85 మంది మగ ఖైదీలు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. ఈ సందర్భం గా జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ విడుదలైన ఖైదీల్లో చర్లపల్లి నుంచి అత్యధికంగా 35 మంది, చంచల్గూడ నుంచి 8 మంది ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ వై రాజేశ్, ఎన్ మురళీబాబు, డీఐజీలు డీ శ్రీనివాస్, ఎం సంపత్, సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎన్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.