అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్య్ర వేడుకలు (Independence Day ) అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయ రాజకీయ పార్టీల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతిలో జరిగిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ( Anam Ramnarayana Reddy ) అస్వస్థతకు గురయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతుండగా కళ్లు తిరిగి పక్కకు వాలిపోగా వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రిని పట్టుకున్నారు. సకాలంలో స్పందించిన వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.