IPS Officer Nupur Prasad | సుశాంత్ కేసు విచారణకు నేతృత్వం వహించిన సీబీఐ అధికారికి ప్రెసిడెంట్స్ మెడల్!
IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్‌ను ప్రతిష్టాత్మకమైన 'మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్' (MSM) వరించింది.
IPS Officer Nupur Prasad | దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు నేతృత్వం వహించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి నూపుర్ ప్రసాద్‌ను ప్రతిష్టాత్మకమైన ‘మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్’ (MSM) వరించింది.
2007 బ్యాచ్‌కు చెందిన ఏజీఎండీయూటీ (AGMUT) క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన నూపుర్ ప్రసాద్.. సీబీఐలో తన సర్వీస్ పూర్తి చేసుకుని ఇటీవల తిరిగి ఢిల్లీ పోలీసు విభాగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం (EOW) జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక నేరాల నిరోధం, దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు పరిపాలనా రంగంలో ఆమె కనబరిచిన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. తన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఢిల్లీ పోలీస్, సీబీఐ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. వీటితో పాటు మహిళల రక్షణ, సైబర్ భద్రత, డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలలోనూ ఆమె చురుకైన పాత్ర పోషించారు. మరోవైపు 2020 జూన్ 14న ముంబైలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఘటనకు సంబంధించి జరిగిన సీబీఐ దర్యాప్తునకు ఆమె పర్యవేక్షకురాలిగా వ్యవహరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cbi
- DelhiPolice
- EOW
- IPS
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

